- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజాన్ని వెలికి తీయాలి…దోషులను శిక్షించాలి : శ్రీధర్ బాబు
దిశ, కాటారం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు లు కుట్ర చేశారన్న బిజెపి నాయకుడు చేసిన ఆరోపణలతో మంథని నియోజకవర్గంలో రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ విషయంపై నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు రాష్ట్ర డిజిపిని కోరారు. గత రెండు రోజులుగా బీజేపీ నాయకుడు చేసిన అసత్య ఆరోపణలు, రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారిపోయే నీచ సంస్కృతి జుగుప్స కలిగిస్తుందన్నారు.
సామాజిక మాద్యమాల్లో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి పెరిగిపోయిందని, ఇటువంటి నీచ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సామాజిక మాద్యమాల్లో చేసిన అసత్య ఆరోపణల మీద సంపూర్ణ విచారణ జరిపించాలని, నిస్పక్షపాతంగా వ్యవహరించి నిజానిజాలను వెలికి తీయాలని, వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని రాష్ట్ర డిజిపి ని శ్రీధర్ బాబు లిఖిత పూర్వకంగా కోరారు.