Nuclear policy: అణు సిద్దాంతాన్ని సవరించిన రష్యా.. పుతిన్ కీలక నిర్ణయం!

by vinod kumar |   ( Updated:2024-11-19 15:03:03.0  )
Nuclear policy: అణు సిద్దాంతాన్ని సవరించిన రష్యా.. పుతిన్ కీలక నిర్ణయం!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. రష్యా భూభాగంపై లాంగ్ రేంజ్ క్షిపణుల(Long ranfe missiles)ను ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా(America) అనుమతించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. యూఎస్ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్ తమ అణు సిద్ధాంతాలను మార్చారు. ఈ మేరకు సవరించిన అణు విధానానికి మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఏ క్షణమైనా రష్యా అణ్వాయుధాలను ప్రయోగించొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ సూత్రాలను చేంజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రష్యా గత అణు విధానం ప్రకారం..బాలిస్టిక్ క్షిపణి దాడి గురించి విశ్వసనీయ సమాచారం తర్వాత మాత్రమే ఒక దేశంపై అణ్వాయుధాలను ఉపయోగించొచ్చు. కానీ కొత్త విధానం ప్రకారం బాలిస్టిక్ క్షిపణులతో పాటు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ లేదా ఇతర వాహనాల ద్వారా దాడి చేసిన సందర్భంలో కూడా వినియోగించుకోవచ్చని పలు కథనాలు వెల్లడించాయి. పాత పాలసీలో రష్యా మిత్రదేశమైన బెలారస్ పై దాడి జరిగినప్పుడు కూడా రష్యా అణ్వాయుధాలను ఉపయోగించాలనే నిబంధన ఉండగా, ప్రస్తుతం దానిని సవరించినట్టు తెలుస్తోంది. అంతేగాక ఒక దేశం అణ్వాయుధాలు కలిగిన దేశంతో కలిసి రష్యాపై సంయుక్తంగా క్షిపణి దాడిని ప్రయోగిస్తే, అటువంటి పరిస్థితిలోనూ మాస్కో అణ్వాయుధాలను ఉపయోగించేలా సవరణలు తీసుకొచ్చారు.

Read More...

Putin To Visit India: త్వరలోనే భారత్ లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Advertisement

Next Story