ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్.. దంపతులు స్పాట్ డెడ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-25 03:44:47.0  )
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్.. దంపతులు స్పాట్ డెడ్
X

దిశ, వైరా : వైరాలోని మధిర క్రాస్ రోడ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సత్తుపల్లి నుంచి హైదరాబాద్‌కు స్కూటీపై వెళ్తున్న దంపతులు రంగా సురేష్ (38), రోజా(34) రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. సత్తుపల్లి చెందిన సుభాష్ హైదరాబాద్‌లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ఉదయం సుభాష్, అతని భార్య రోజా స్కూటీపై సత్తుపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

అయితే వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద స్కూటీ ద్విచక్ర వాహనాన్ని సత్తుపల్లి నుంచి వస్తున్న టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టింది. టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనంతో పాటు వీరిరువురిని కొంత దూరం ఈడ్చుకొని వెళ్ళింది. దీంతో సుభాష్, రోజా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైరా ఏసీపీ రెహమాన్, ఎస్సై శాకమూరి వీరప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెంది రోడ్డుపై చల్లాచెదురుగా మృతదేహాలు పడిన ఘటన స్థానికుల హృదయాలను కలిచి వేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story