- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రవీణ్ ఒక్కడే కాదు.. మరో 8 మంది పరీక్షలు రాశారు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సిట్అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ బోర్డులో పని చేస్తున్న మరో ఎనిమిది మంది కూడా గ్రూప్1తోపాటు వేర్వేరు పరీక్షలు రాసినట్టు గుర్తించారు. ఈ ఇద్దరితోపాటు బోర్డులో పనిచేస్తున్న మొత్తం నలభై రెండు మంది ఉద్యోగులకు కూడా నోటీసులు జారీ చేసిన వీరిని క్షుణ్నంగా విచారించాలని నిర్ణయించారు. ఇక, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకకు కొన్ని కోచింగ్సెంటర్ల నిర్వాహకులతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైన క్రమంలో ఆ దిశగా కూడా సిట్అధికారులు దృష్టి సారించారు. రాజశేఖర్‌రెడ్డిని ప్రభుత్వ శాఖలో ఔట్సోర్సింగ్ఉద్యోగిగా నియమించిన ప్రైవేట్ఏజన్సీ నిర్వాహకులను కూడా సిట్అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలిసింది. బోర్డులోని కాన్ఫిడెన్షియల్రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్లక్ష్మి వాంగ్మూలాన్ని గురువారం మరోసారి రికార్డు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాలు బోర్డు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
ఒక్కడే కాదు..
ఇంతకు ముందు జరిపిన విచారణలో బోర్డు ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్ష రాసినట్టుగా వెల్లడైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా జరిపిన దర్యాప్తులో ఒక్క ప్రవీణే కాకుండా బోర్డులో పనిచేస్తున్న మరో ఎనిమిది మంది కూడా గ్రూప్1ప్రిలిమ్స్‌తోపాటు వేర్వేరు పరీక్షలు రాసినట్టుగా సిట్దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. దాంతో ఈ ఎనిమిది మందిని కూడా నిశితంగా విచారించాలని సిట్అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని సూచించారు. ఆయా పరీక్షల్లో ఈ ఎనిమిది మందికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి?..డ్యూటీలో ఉండే పరీక్షలు రాశారా?..నిబంధనల ప్రకారం సెలవులపై వెళ్లి పరీక్షలు రాశారా?..లీకైన ప్రశ్నాపత్రాలు వీరిలో ఎవరి చేతికైనా అందాయా?..అందితే ఎవరి నుంచి? అన్న అంశాలపై వీరిని ప్రశ్నించనున్నట్టు తెలిసింది.
మొత్తం 42 మంది ఉద్యోగులకు నోటీసులు..
దాంతోపాటు బోర్డులో పనిచేస్తున్న మొత్తం నలభై రెండు మంది ఉద్యోగులను కూడా ప్రశ్నించాలని సిట్అధికారులు నిశ్చయించారు. వీరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. లీకేజీ కేసులో మొదటి ఇద్దరు నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలతో ఎవరెవరు సన్నిహితంగా ఉండేవారు?..లీకేజీలో ఇంకా ఎవరైనా వీరికి సహకరించారా? అన్నది నిగ్గు తేల్చటానికే వీరిని విచారణ జరపాలని సిట్అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.
సిట్ ఆఫీస్‌లో..
లీకేజీ కేసులో ఉన్న తొమ్మిది మంది నిందితులను ఆదివారం మరోసారి సిట్కార్యాలయంలో విచారణ చేశారు. ప్రశ్నాపత్రాలను లీక్‌చేసిన తీరు, వాటిని బయటి వ్యక్తులకు ఎలా అమ్మారు? అన్న విషయాలపై ప్రధానంగా వీరిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారింది?, ఎవరెవరికి ఎన్ని డబ్బులు ముట్టాయి?, ఆ డబ్బును ఏం చేశారు? అన్న విషయాలపై వీరిని ప్రశ్నించినట్టు సమాచారం.
శంకర్‌లక్ష్మిని రెండోసారి..
ఈ క్రమంలోనే బోర్డులోని కాన్ఫిడెన్షియల్రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్‌లక్ష్మిని మరోసారి ప్రశ్నించాలని సిట్అధికారులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి శంకర్‌లక్ష్మిని సిట్కార్యాలయానికి పిలిపించి విచారించిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది మంది నిందితులను విచారించిన క్రమంలో వెల్లడైన వివరాల మేరకు గురువారం మరోసారి ఆమెను సిట్ఆఫీస్కు పిలిపించి వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. కాన్ఫిడెన్షియల్రూంలో ఉన్న కంప్యూటర్‌కు సంబంధించిన డైనమిక్ఐపీ అడ్రస్‌తోపాటు పాస్వర్దులను శంకర్లక్ష్మి డైరీ నుంచే తస్కరించినట్టు ఇప్పటికే నిందితుడు ప్రవీణ్విచారణలో వెల్లడించాడు. అయితే, తాను ఎక్కడా ఐపీ అడ్రసులు, పాస్‌వర్డులను రాసి పెట్టలేదని శంకర్లక్ష్మి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నిజమేమిటన్నది నిర్ధారించుకోవటానికే ఆమెను రెండోసారి ప్రశ్నించాలని సిట్అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
కోచింగ్సెంటర్ల నిర్వాహకులను సైతం..
లీకేజీ కేసులో మూడో నిందితురాలిగా ఉన్న రేణుకను విచారించినపుడు ఆమెకు కొన్ని కోచింగ్సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్టుగా వెల్లడైందని సమాచారం. ఇప్పటికే సిట్అధికారులు ఆ కోచింగ్సెంటర్ల వివరాలను రేణుక నుంచి తీసుకున్నట్టు తెలిసింది. తాజాగా ఈ కోచింగ్సెంటర్లను నడుపుతున్న వారిని కూడా పిలిపించి ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీరిలో ఎవరికైనా రేణుక ప్రశ్నాపత్రాలు ఇచ్చిందా?..ఇస్తే ఆయా సెంటర్ల నిర్వాహకులు ఎవరికైనా అమ్మారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేయాలని సిట్అధికారులు భావిస్తున్నారు.
ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా..
ఇదిలా ఉండగా బోర్డు నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమ్స్‌తోపాటు ఇతర పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను సిట్సిద్ధం చేసినట్టుగా తెలిసింది. వీళ్లందరిని కూడా సిట్కార్యాలయానికి పిలిపించనున్నట్టు సమాచారం. పరీక్షల్లో అన్ని మార్కులు ఎలా సంపాదించారు?..లీకైన ప్రశ్నాపత్రాలను వీళ్లలో ఎవరైనా కొన్నారా?..కొంటే ఎవరి నుంచి? అన్న అంశాలపై వీరిని ప్రశ్నించనున్నారు.
రమేశ్ పాత్ర ఏమిటి..?
ఇక, లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజశేఖర్‌రెడ్డి స్నేహితుడు రమేశ్పాత్రపై కూడా సిట్అధికారులు ఆరా తీస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో రమేశ్ ఒకడని సిట్విచారణలో ఇప్పటికే తేలింది. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల అమ్మకంలో రమేశ్అతనికి సహాయపడ్డాడా?..సహాయపడితే ఎలా సహాయపడ్డాడు?..ఎవరికైనా ప్రశ్నాపత్రాలు విక్రయించాడా?..విక్రయిస్తే కొన్నవాళ్లు ఎవరు? అన్న అంశాలపై అతని నుంచి వివరాలు సేకరించాలని సిట్అధికారులు భావిస్తున్నారు. ఇక, రాజశేఖర్‌రెడ్డిని ఔట్సోర్సింగ్ఉద్యోగిగా నియమించింది తెలంగాణ స్టేట్టెక్నలాజికల్సర్వీసెస్అని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆ సంస్థకు చెందిన నిర్వాహకులతో కూడా మాట్లాడాలని సిట్అధికారులు భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది.