పోలీస్ స్టేషన్‌లో సూసైడ్ అటెంప్ట్ చేసిన రౌడీషీటర్ మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-22 05:59:27.0  )
పోలీస్ స్టేషన్‌లో సూసైడ్ అటెంప్ట్ చేసిన రౌడీషీటర్ మృతి
X

దిశ, తాడ్వాయి : చికిత్స పొందుతూ రౌడీషీటర్ మృతి చెందిన ఘటన తాడ్వాయిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి గ్రామానికి చెందిన లాలమ్మల సంతోష్(33) రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది మంటలు ఆర్పి క్షతగాత్రుడిని సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. మృతుడికి భార్య సోనీ, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Next Story
null