భార్య ఆత్మహత్యతో బోరున విలపించిన ఎమ్మెల్యే (వీడియో)

by Mahesh |   ( Updated:2024-06-21 16:15:34.0  )
భార్య ఆత్మహత్యతో బోరున విలపించిన ఎమ్మెల్యే (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపాదేవి అల్వాల్ లోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.గురువారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి రాగా.. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి బెడ్ పై నిర్జీవంగా పడి ఉన్న తన భార్యను చూసిన ఎమ్మెల్యే తట్టుకోలేక బోరున విలపించారు. దీంతో ఆయన సృహ కోల్పోవడం తో ఆయనకు చికిత్స అందించారు. కాగా ఈ సమాచారం అందుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. ఎమ్మెల్యే సత్యంకు అండగా నిలిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. గురువారం ఎమ్మెల్యే తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Next Story