ఆ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధం: మంత్రి KTR ఛాలెంజ్

by Satheesh |   ( Updated:2023-01-28 09:38:54.0  )
ఆ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధం: మంత్రి KTR ఛాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. శనివారం నిజామాబాద్ పర్యటనలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెలంగాణఫై కక్ష్య కట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే సత్తా మాకుందని.. కేంద్రం ఏం చేసిందో చెప్పే సత్తా బీజేపీకి ఉందా అని నిలదీశారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఇక్కడున్న జూట్ బోర్డును కూడా ఎత్తేశారని విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ సారైనా తెలంగాణకు చోటు దక్కుతుందా అని నిలదీశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని.. విభజన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రెండు లక్షల కోట్ల తెలంగాణ పన్నులను.. కేంద్ర పాలనలో ఉన్నా రాష్ట్రాల్లో వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ నుండి కేంద్ర రూపాయి తీసుకుని.. తిరిగి రాష్ట్రానికి కేవలం 46 పైసలే ఇస్తోందని.. నేను చెప్పిన ఈ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్: సిద్ధంగా ఉండండి.. ఎన్నికలపై మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story