మహిళలపై అణిచివేత పెరిగిపోయింది: మావోయిస్టు పార్టీ

by GSrikanth |
మహిళలపై అణిచివేత పెరిగిపోయింది: మావోయిస్టు పార్టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా మహిళలకు సమాన హక్కులు లభించలేదని, దోపిడీ, అణచివేతలు మరింత పెరిగిపోయాయని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలను సంఘటిత పరిచే లక్ష్యంతో మార్చి 8న పీడిత వర్గాల మహిళల పోరాట దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పాలకులు అనుసరిస్తున్న విధానాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయని, మహిళల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. పాలక విధానాలు అట్టడుగు వర్గాల, కులాల, మతాల మహిళల అస్తిత్వానికి పెను ప్రమాదం గా మారాయని పేర్కొన్నారు. స్త్రీ సమస్యల విముక్తి పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story