- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైడ్రా ఏర్పాటుపై హైకోర్టు ప్రశ్నల వర్షం
దిశ, వెబ్ డెస్క్: జన్వాడలోని తమ ఫామ్‌హౌస్‌ను కూల్చి వేయకుండా స్టే ఇవ్వాలని ప్రదీప్ కన్ స్ట్రక్షన్ అధినేత ప్రదీప్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే అసలు హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ) లీగల్ స్టేటస్ ఎంటని, హైడ్రా విధివిధానాలు ఎంటని, ఏ ప్రాతిపదికన హైడ్రా ని ఏర్పాటు చేశారని హైకోర్టు న్యాయమూర్తి హైడ్రా పై ప్రశ్నల వర్షం కురిపించారు. అలగే రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్‌లో కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది.
జీహెచ్ఎంసీ తో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 60 శాతం వరకు చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లుగా హైడ్రా అధికారులు పక్కాగా లెక్కలు తేల్చారు. అక్రమ నిర్మాణాల నిర్మూలనే ధ్యేయం గా హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్ వైశాలి నగర్‌లో ఎఫ్టీఎల్‌లో నిర్మించిన మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. అదేవిధంగా గాజులరామారం, రాజేంద్రనగర్ శాస్త్రిపురం, మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంటలో మిగతా చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్లింది.