- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: High Court
దిశ, డైనమిక్ బ్యూరో: షర్మిల ఇంటి ముందు బారీకేడ్లా? షర్మిల ఇంటి ఎదుట మీరెందుకు? అంటూ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా.. పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్మిల పిటిషన్పై విచారించిన న్యాయస్థానం.. షర్మిల ఇంటి ముందు బారీకేడ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు, షర్మిలను నిన్న కోర్టుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆమె తరపు న్యాయవాది వాదించారు.
ఇంట్లో నుండి బయటికి రానివ్వకుండా ప్రతి రోజూ పోలీసులు అడ్డుకుంటున్నారని..కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా బయటకు రానివ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. షర్మిల వల్ల తరుచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెయిల్ షరతులను షర్మిల ఉల్లంఘించారని..ఎస్ఆర్ నగర్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఘటనలను కోర్టుకు వివరించారు. తన కార్యక్రమాలపై పోలీసులకు ఆమె తప్పుడు సమాచారం ఇస్తోందని చెప్పారు. దీంతో, ఆమె ఇంటి ఎదుట బారీకేడ్లను తొలగించాలని పోలీసులకు చెప్పిన కోర్టు.. షర్మిలకు పలు సూచనలు కూడా చేసింది. రోడ్లపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టొద్దని సూచించింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. ఇదిలావుంటే, కోర్టులో పిటిషన్ వేసే ముందు షర్మిలా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల పేర్కొన్నారు.