- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పరకాల సబ్ జైల్ నుంచి పరారైన ఖైదీ ఇలా చిక్కిండు..

దిశ, హనుమకొండ టౌన్: పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనం రేపింది. ఇటీవల పోస్కో చట్టం నేర ఆరోపణతో ఏటూరునాగారంకు చెందిన మహమ్మద్ పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు. 2019 మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో మహిళపై అఘాయిత్యం కేసు నమోదు చేయడం జరిగింది. సోమవారం ఉదయం రోజువారి పనుల్లో భాగంగా మహమ్మద్ పాషా జైలు ఆవరణలో ఉన్న చెత్తను జైలు బయట పడబోసి వస్తానని చెప్పడంతో జైలు అధికారి అతన్ని బయటకు పంపినట్లు తెలిసింది.
ఇదే అదనుగా భావించిన మహమ్మద్ పాషా జైలు నుంచి పరారైనట్లు తెలిసింది. కాగా ఖైదీ మహమ్మద్ పాషాను కామారెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో దొరికినట్లు పరకాల సబ్ జైలు అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిందితుడు పరారైన విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జైలు అధికారులు అతన్ని పట్టుకోవడం కోసం పరకాల పట్టణాన్ని జల్లెడ పట్టారు. జైలు అధికారితో పాటు 8 మంది సిబ్బంది పరకాలతో పాటు ప్రధాన రహదారులను వ్యవసాయ పొలాలను లక్ష్యంగా చేసుకొని గాలింపు చేపట్టారు. చివరకు పరకాల మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలోని లలిత కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. జైలు అధికారి ప్రభాకర్ రెడ్డితో పాటు 8 మంది సిబ్బంది అక్కడికి వెళ్లి అతని పట్టుకుని పరకాల సబ్ జైలుకు తీసుకొచ్చినట్లు తెలిపారు.