- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG: టెన్త్ ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత నిర్ణయం వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్ష విధానం(10th Class Exam Pattern)లో మార్పులు చేపడుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అనూహ్యంగా బ్యాక్ స్టెప్ వేసింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న టెన్త్ పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు లేవని సర్కార్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న విధానాన్నే ఈ విద్యాసంవత్సరం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. 80 మార్కుల పరీక్ష, ఇంటర్నల్‌కు 20 మార్కుల విధానాన్నే ఈసారి కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 80 మార్కుల పరీక్ష, ఇంటర్నల్ 20 మార్కుల విధానానికి స్వస్తి చెప్పి వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని ఉత్తర్వులు జారీ చేయడంపై సర్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. హడావుడి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ఇచ్చిన జీవోను సవరించింది. అయితే 2025-26 విద్యాసంవత్సరం నుంచి మార్పులు ఉంటాయని, వంద మార్కుల విధానాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.