BRS: డిక్లరేషన్ లో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు..? మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సూటి ప్రశ్న

by Ramesh Goud |
BRS: డిక్లరేషన్ లో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు..? మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్(Congress Farmer Declaration) లో లేని ఆంక్షలు(Restrictions) ఇప్పుడెందుకు? అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Suryapet MLA Jagadish Reddy) ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని, రెండు లక్షలు దాటిన వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారని తెలిపారు. అంతేగాక రైతులు ఇప్పుడే వెళ్లి 2 లక్షలు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగులు రైతుల మదిలో ఉన్నాయని గుర్తుచేశారు.

అలాగే అధికారంలోకి వచ్చిన నాడు 49 వేల కోట్లు అని చెప్పి, దానిని 36 వేల కోట్లకు కుదించి, 26 వేల కోట్లకు కేబినెట్ ఆమోదం చెప్పి, 18 వేల కోట్లు రుణమాఫి చేశారని, అందులో చివరికి 12.5 కోట్లు మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మొత్తం లెక్కలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. ప్రజలను మోసం చేసేందుకే ఈ కేసులు(Cases), ఈ కమిషన్లు(Commissions) వేస్తున్నారని, రైతులను మోసం చేసినా.. చేస్తున్న ఈ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వీళ్ల బరతం పట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు.. ఎంత మందికి రుణమాఫీ(Loans waived) అయ్యింది.. అనేది ప్రతీ ఊర్లో లిస్టులు పెట్టి వీరి భండారాన్ని బయటపెడతామని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఒక్కో వర్గాన్ని ఎలా మోసం చేస్తుందో రైతులు కూడా చర్చించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించారు.

Advertisement

Next Story