- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉద్యోగానికి వెళ్లిన యువతి మిస్సింగ్
దిశ, చైతన్యపురి : ఉద్యోగానికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో తన కూతురు ఆచూకీ కనుగొనాలని తండ్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన శనివారం జరిగింది. మునగనూరు మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన గుంటి గాయత్రి (23) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈనెల 3న సాయంత్రం 7 గంటలకి గచ్చిబౌలిలో ఉన్న ఆఫీస్ కి డ్యూటీ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరింది. డ్యూటీ ముగిసిన తర్వాత మరుసటి రోజు ఈనెల 4న ఉదయం 7 గంటలకు ఇంటికి రావాల్సి ఉంది. కానీ గాయత్రి తిరిగి ఇంటికి రాలేదు. గాయత్రీ గురించి ఆఫీస్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో తన స్నేహితులు, బంధువుల దగ్గర వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదని గాయత్రి తండ్రి గుంటి సత్యనారాయణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజు గౌడ్ తెలిపారు. సత్యనారాయణకు ఇద్దరి కూతుళ్లు, ఒక కొడుకు, గాయత్రి చిన్న కూతురు.