- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HHVM: పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్డేట్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత ఏఎమ్ రత్నం(AM Rathnam) నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబి డియోల్(Bobby Deol) విలన్‌గా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నారు.
ఇటీవలే ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. తాజాగా దానికి కొనసాగింపుగా మరో క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రాత్రిలో చలికి మంట కాచుకుంటూ డప్పు దరువేస్తున్న పవన్ కల్యాణ్ ఫొటోను విడుదల చేశారు. ఈ లుక్ నెక్ట్స్ లెవెల్ కిక్కిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జనవరి 6వ తేదీన ఉదయం 9 గంటల 6 నిమిషాలకు ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాటను స్వయంగా పవన్ కల్యాణే పాడటం మరో విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.