- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
52 ఏళ్ళ వయసులో 150 కి.మీ ఈత కొట్టిన మహిళ.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
దిశ, వెబ్ డెస్క్: 52 ఏళ్ళ వయసులో ఓ మహిళా ఏకంగా 150 కిలో మీటర్లు ఈతకొట్టి రికార్డు సృష్టించగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. శ్యామల అనే 52 ఏళ్ల మహిళా..ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ(Odyssey Ocean Swimming Company) ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల(Shyamala) సాహసయాత్ర(Adventure) ప్రారంభించింది. ఇందులో భాగంగా.. విశాఖ సముద్ర తీరం నుండి కాకినాడ తీరం(Visakhapatnam coast to Kakinada coast) వరకు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ. ఈదుకుంటూ.. శుక్రవారం గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకుని రికార్డు సృష్టించింది. మహిళపై సాహసయాత్రపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా శ్యామలపై ప్రశంసలు కురిపించారు.
సీఎం తన ట్వీట్‌లో "52 సంవత్సరాల వయస్సులో, గోలి శ్యామల 150 కిమీ విజయవంతంగా విశాఖపట్నం నుండి కాకినాడ వరకు ఈదడం ఒక అసాధారణ ధైర్యం, సంకల్పం గాథ. ఆరు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ బిడ్డ అనేక సవాళ్లను ఎదుర్కొని.. ధైర్యం తో జయించగలిగింది. ఆమె ప్రయాణం కేవలం నారీ శక్తి యొక్క ప్రకాశనమైన ఉదాహరణ మాత్రమే కాకుండా, మానవ ఆత్మ, శక్తి ప్రతిబింబం కూడా. ఆమె మన సముద్ర జీవనాన్ని రక్షించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసింది. తన ప్రశంసనీయమైన విజయం ద్వారా మిలియన్ల మందిని ప్రేరేపించింది. ఈ సందర్భంగా శ్యామల అభినందనలు!" అని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన ట్వీట్ లో రాసుకొచ్చారు.