Bollywood News : ఆసుపత్రిలో చేరిన 'గేమ్ ఛేంజర్' బ్యూటీ?

by M.Rajitha |   ( Updated:2025-01-04 11:05:55.0  )
Bollywood News : ఆసుపత్రిలో చేరిన గేమ్ ఛేంజర్ బ్యూటీ?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి కియారా అద్వానీ(Kiara Advani) అనారోగ్యం కారణంగా ముంబైలోని ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు శనివారం ఉదయం నుంచి సోష‌ల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ రూమర్స్ ను ఆమె ప్రతినిధి ఖండించారు. కియారా అద్వానీ ఏ ఆసుపత్రిలో చేరలేదని.. ఆమె ఆరోగ్యంగానే ఉందని బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంద‌ని అంతే త‌ప్ప సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు ఫేక్ అని తెలిపారు. కియారా అద్వానీ న‌టిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజ‌ర్(Game Chnager). రామ్ చ‌ర‌ణ్(Ram Charan) క‌థానాయ‌కుడిగా.. న‌టిస్తున్న ఈ సినిమాకు శంక‌ర్(Shankar) ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వరుస ప్రమోషన్ కార్యక్రమాలతో నీరసంగా ఉండటంతో గేమ్ ఛేంజ‌ర్ ట్రైల‌ర్ ఈవెంట్‌కి కూడా రాలేదు. దీంతో కియారా ఆరోగ్యం పాడై ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని వార్తలు షికార్లు చేస్తుండగా.. తాజాగా వాటన్నిటికీ చెక్ పడింది.

Advertisement

Next Story

Most Viewed