- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలి : ఎస్పీ కిరణ్ ఖర్గే
దిశ, వరంగల్ బ్యూరో : బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖర్గే అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -XI ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులను కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బాల కార్మికుల విముక్తి ఎస్పి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ -XI లో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అన్నారు. క్షణికావేశంలో కొందరు పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని,ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తప్పిపోయిన పిల్లలను వెతికి 'దర్పణ్ ' అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలన్నారు. భిక్షాటన చేస్తున్న వారి గురించి, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు.
భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ తో పాటుగా, సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై వివిధ ప్రాంతాల్లో పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలని అన్నారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు.ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి లేదా పోలీసులకు సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఇన్చార్జి డీఈవో లక్ష్మణ్, డీసీపీవో వెంకట స్వామి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,డీసీఆర్ బీఇనస్పెక్టర్ రమేష్, సీడబ్ల్యూసీ మెంబర్ దామోదర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద, వివిధ డిపార్ట్మెంట్ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.