Ration Rice Theft : రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు ఒక రోజు కస్టడీ

by Y. Venkata Narasimha Reddy |
Ration Rice Theft : రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు ఒక రోజు కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో రేషన్ బియ్యం మాయమైన కేసు(Ration Rice Theft Case)లో నిందితులకు మచిలిపట్నం కోర్టు(Machilipatnam Court) ఒక రోజు పోలీస్ కస్టడీ(One-day Custody)విధించింది. కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఏ 6గా, ఆయన సతీమణి పేర్ని జయసుధ ఏ1గా ఉండగా, వారితో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వారిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది. రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న నిందితుల్ని కస్టడీకి కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు.

పిటిషన్ ను విచారించిన కోర్టు నిందితుల ఒక రోజు కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని సతీమణికి కోర్టు అంతకుముందు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల ఆమెను పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఈ కేసులో మరో నలుగురిని పోలీసుల అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరోవైపు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో నలుగురు నిందితులు పిటీషన్ దాఖలు చేశారు. గత నెల రోజులుగా పేర్ని నాని గోడౌన్‌లకు సంబంధించిన వ్యవహారంలో పోలీస్‌, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. పేర్ని నాని గోడౌన్‌లో నుంచి 7,577 బస్తాల బియ్యం మాయమైనట్లు అధికారులు తేల్చారు.

Advertisement

Next Story