- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా?’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేడు(శనివారం) వైసీపీ నేత శ్యామల(YCP Leader Shyamala) మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల ఆరోపించారు.
‘తల్లికి వందనం’ పథకం కోసం విద్యార్థులు, తల్లులు ఎదురు చూస్తున్నారని వైసీపీ నేత శ్యామల అన్నారు. ఆ పథకం ఎందుకు ఇవ్వట్లేదని జనం మధ్యలోకి వచ్చి టీడీపీ నేతలు(TDP Leaders) క్షమాపణ చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. 2025 జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి లోకేశ్(Nara Lokesh) ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘‘మహిళలకు ఉచిత బస్సు పథకం లేదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు. సూపర్ సిక్స్ పేరుతో జనాలను బాబు నిలువునా మోసం చేశారు. హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా? ఇప్పుడు నిధులు లేవని ఎలా చెప్తారు? అని ఆమె ఫైర్ అయ్యారు.