- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బుమ్రా లేకపోతే అదే జరిగేది : హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా 8 ఏళ్లుగా అంటిపెట్టుకున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన విషయం తెలిసిందే. ఐదో టెస్టులో నెగ్గిన ఆస్ట్రేలియా 3-1తో సిరీస్ సొంతం చేసుకుంది. భారత్ సిరీస్ ఓటమిపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు. బుమ్రా లేకుంటే భారత్ 5-0 తేడాతో ఓడిపోయేదని వ్యాఖ్యానించాడు. పెర్త్‌లో కూడా భారత్ బుమ్రా వల్లే గెలుపొందిందన్నాడు. ‘ఆసిస్ టూరులో వెళ్లిన జట్టులో గనక బుమ్రా లేకుంటే ఆస్ట్రేలియా సిరీస్‌ను 5-0తో ముగించేది. పెర్త్‌లో జట్టును బుమ్రా కాపాడాడు. మిగతా మ్యాచ్‌ల్లో కూడా భారత్‌కు అండగా నిలిచాడు. సిరీస్‌లో బుమ్రా లేకపోతే భారత్ 5-0 లేదా 4-0తో కోల్పోయేది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఆసిస్ గడ్డపై బుమ్రా సత్తాచాటిన విషయం తెలిసిందే.సిరీస్‌లో బ్యాటర్లు విఫలమైన వేళ జట్టును గెలిపించడానికి ఒంటరి పోరాటం చేశాడు. 32 వికెట్లతో సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.