- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
దిశ, గద్వాల కలెక్టరేట్ : డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. సోమవారం దౌదర్‌పల్లి సమీపంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్లను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, లేఅవుట్ మ్యాప్, ప్రదేశ వివరాలు, నిర్మాణ పత్రాలు పరిశీలించారు. ఇళ్లను లోపల, బయట,పైకప్పు వరకు పూర్తిగా పరిశీలించి,పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, సకాలంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక వసతులైన నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ,సెప్టిక్ ట్యాంకులు, పరిసరాల శుభ్రత, సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం గోనుపాడు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గద్వాల తహశీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ దశరథ్, విద్యుత్ శాఖ డిఇ లక్ష్మీనాయక్, పంచాయతీ రాజ్ ఈఈ రాంచందర్, ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ రెడ్డి,తదితర అధికారులు పాల్గొన్నారు.