CM Revanth: ఆ ఒక్కటి పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారడం ఖాయం

by Gantepaka Srikanth |
CM Revanth: ఆ ఒక్కటి పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తామని.. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సోమవారం దాదాపు రూ.800 కోట్లతో నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్(Arangar - Zoo Park Flyover) మధ్య 4.08 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. వారి తండ్రి బాటలోనే ఒవైసీ సోదరులు(Owaisi brothers) కూడా నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. ఎంఐఎంతో కలిసి నగర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. పాతబస్తీ(OldCity)లో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

త్వరలోనే ఎంఐఎం ఎమ్మెల్యేల(MIM MLAs)తో సమావేశమై నగర అభివృద్ధిపై చర్చించబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ(Metro Expansion)కు సహకరించాలని ఇప్పటికే ప్రధాని మోడీ(PM Modi)ని కోరినట్లు గుర్తిచేశారు. ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా త్వరగా ఇవ్వాలని విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్(Regional Ring Road) పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారతాయని కీలక ప్రకటన చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం జరిగింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం జరిగిందని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఆయన తర్వాత నగరం కబ్జా కోరల్లో చిక్కుకున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు జరిగిన ఆక్రమణల వల్ల నగరం అస్తవ్యస్తమైందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా ఆక్రమణల వల్ల దెబ్బతింటోందని తెలిపారు. ఆక్రమణల వల్ల హైదరాబాద్‌లో చిన్న వర్షం పడినా వరదనీరు ఇళ్లలోకి వస్తుందని వెల్లడించారు. మెట్రో నిర్మాణంతో పాతబస్తీ రూపురేఖలు కూడా మారబోతున్నాయని అన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

Advertisement

Next Story