తెలంగాణలో భారీ వరదలు.. ప్రధాని మోడీకీ సీఎం రేవంత్ లేఖ

by Mahesh |   ( Updated:2024-09-02 15:16:26.0  )
తెలంగాణలో భారీ వరదలు.. ప్రధాని మోడీకీ సీఎం రేవంత్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నాలుగు జిల్లాల్లో ఏర్పడిన వరదలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో అధికారులో సీఎం చర్చించారు. వరదలపై తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అలాగే వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టరేట్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు.. మంజూరు చేశారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు కూడా పరిహారం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలోని వరదలను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని.. తక్షణమే కేంద్రం ఆర్థిక సాయం చేయాలని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని మోడీని కోరుతూ లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల సమావేశంలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed