Section 163: సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం.. సెక్షన్ 163 అమలు, భారీగా పోలీసుల మోహరింపు

by Shiva |   ( Updated:2024-10-28 06:25:22.0  )
Section 163: సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం.. సెక్షన్ 163 అమలు, భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బెటాలియిన్ల (Battalions) పరిధిలో కానిస్టేబుళ్లు రోడ్డెక్కారు. ‘ఏక్ పోలీస్.. ఏక్ స్టేట్’ (Ek Police.. Ek State) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చూస్తూ గత రెండు వారాల నుంచి నిరసన బాట పట్టారు. ఇప్పటి వరకు 49 మంది టీజీఎస్‌పీ (TGSP) సిబ్బందిపై పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అందులో 39 మందిపై సస్పెన్షన్ (Suspension) వేటు వేయగా.. మరో 10 మందిని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో సిబ్బందిపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. వివిధ బెటాలియన్ల పరిధిలోని కానిస్టేబుళ్లు (Constables) ఇవాళ సెక్రటేరియట్ (Secretariat) ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు సచివాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సచివాలయం (Secretariat) పార్కింగ్ గ్రౌండ్‌ (Parking Ground)లో దాదాపు 200 మంది పోలీసులను ఒకేచోట మోహరించారు. అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) ప్రాంగణంలో కూడా మరికొంత మందిని మోహరించారు. అదేవిధంగా సచివాలయం (Secretariat) చుట్టూ సెక్షన్-163ని అమలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed