Vijay Madhuri : నేను మచ్చలేని మనిషిని.. నా పరువు తీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు..

by Sumithra |   ( Updated:2024-10-28 06:47:56.0  )
Vijay Madhuri : నేను మచ్చలేని మనిషిని.. నా పరువు తీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు..
X

దిశ, శేరిలింగంపల్లి : జన్వాడ ఫామ్ హౌస్ ( Janwada Farm House ) పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు తనను కావాలనే ఇరికిస్తున్నారని, తాను అనని మాటలను కూడా అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఇది తన పరువుతో పాటు రాజ్ పాకాల పరువు తీసేలా ఉందని విజయ్ మద్దూరి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన విజయ్.. రాజ్ పాకాల ( Raj Pakala ) ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో తన పేరుతో ఇష్టం వచ్చిన విధంగా కథనాలు వెలువరిస్తున్నారని అన్నారు. తాను చెప్పని మాటలను సైతం ఎఫ్ఐఆర్ లో ( FIR ) ఉన్నట్లుగా చెబుతున్నారని, అసలు అక్కడ జరిగింది రేవ్ పార్టీ కాదని, దీపావళి సందర్భంగా జరిగిన ఫ్యామిలీ పార్టీ మాత్రమేనని అన్నారు.

రాజ్ పాకాల తన మిత్రుడు అని అంగీకరించిన విజయ్ మద్దూరి తాను ఫ్యామిలీతో కలిసి పార్టీకి అటెండ్ అయినట్లు స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని తేల్చి చెప్పారు. ఇటీవలే ప్రపంచ పర్యటన ( World tour ) పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చానన్న ఆయన తాను ముందు భారతీయుడినని, తనకు అమెరికా పౌరసత్వం తెలిపారు. అమెరికాలో 15 సంవత్సరాలుగా ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారులు చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎక్కడా చిన్న మచ్చలేకుండా వ్యాపారాలు చేస్తున్న తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తన పరువు, రాజ్ పాకాల పరువు తీసేందుకు ఇలాంటివి చేస్తున్నారని విజయ్ మద్దూరి ఆవేదన వ్యక్తం చేశారు.

Read More: Janwada Rave Party: రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు..!

Advertisement

Next Story