Accident : స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు..

by Sumithra |   ( Updated:2024-10-28 05:53:07.0  )
Accident : స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు..
X

దిశ, చింతలపాలెం : స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో ( Dondapadu village ) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే దొండపాడు గ్రామంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ బస్సు రామాపురం నుండి విద్యార్థులను ఎక్కించుకుని బయలు దేరింది. సరిగ్గా దొండపాడు గ్రామంలోని ఎన్టీఆర్ బొమ్మల సెంటర్ వద్దకు రాగానే మూలమలుపు వద్ద బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ద్విచక్రవాహనం ( wo-wheeler ) పై వస్తున్న సిమెంట్ ప్లాంట్ ఉద్యోగిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి బలమైన గాయాలు తగిలాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story