Ponguleti Srinivas Reddy: పొంగులేటికి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్.. పుట్టిన రోజున మంత్రి కీలక నిర్ణయం

by Prasad Jukanti |   ( Updated:2024-10-28 06:35:07.0  )
Ponguleti Srinivas Reddy: పొంగులేటికి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్.. పుట్టిన రోజున మంత్రి కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కలిశారు. తన పుట్టిన రోజు పురస్కరించుకుని పొంగులేటి మర్యాదపూర్వకంగా సీఎంను సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్న మవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి పొంగులేటి ధన్యవాదాలు తెలిపారు.

బోకేలు.. శాలువాలు వద్దు:

తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ బొకేలు, శాలువాలు లేకుండానే రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కరచాలనం ముద్దు అని పేర్కొన్నారు. బొకేలు, శాలువాలు, మెమోంటోలు, కేక్ లకు అయ్యే ఖర్చులను సమాజ, సామాజిక కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. అనవసరమైన ఖర్చులను తగ్గించాలన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోనూ హంగు ఆర్భాట కార్యక్రమాలను తగ్గించుకుని పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు,పేద ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేయాలని, మెడికల్ క్యాంపులు, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు.

Advertisement

Next Story