Naga Manikanta: బిగ్ బాస్ హౌస్ లో 16 మందికి రెండే బాత్రూమ్స్ చాలా ఇబ్బంది పడ్డా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ మణికంఠ

by Prasanna |   ( Updated:2024-10-28 09:28:12.0  )
Naga Manikanta: బిగ్ బాస్ హౌస్  లో 16 మందికి రెండే బాత్రూమ్స్ చాలా ఇబ్బంది పడ్డా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ మణికంఠ
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 ( bigg boss 8) ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు పెడుతూ కొత్తగా ప్లాన్ చేశారు. కానీ, షో కి ఎలాంటి హైప్ రాకపోవడంతో రేటింగ్ కూడా తగ్గింది. ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. అయితే, గత వారం ఓట్లతో సంబంధం లేకుండా మణికంఠ (Naga Manikanta) ఎలిమినేట్ అయ్యాడు.

హెల్త్ సపోర్ట్ చేయకపోవడంతో బిగ్ బాస్ షో ( bigg boss 8) నుండి తప్పుకున్న నాగ మణికంఠ, ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ల్లో వెల్లడించాడు. " ఉదయాన్నే లేవాలి.. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే అందరూ లేవాలి. ఆ సౌండ్స్ కి నాకు భయంగా అనిపించేది. 16 మందికి రెండే బాత్రూమ్స్ చాలా ఇబ్బంది పడ్డాను. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ సమయంలోనే చేసుకోవాలి ఒక్కోసారి అసలు సమయం సరిపోదు.అప్పుడు ఫుడ్ సరిగా కుక్ అవ్వదు. రేషన్ తెచ్చుకోవడానికి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి రైస్ అస్సలు సరిపోదు. అప్పుడు రెండు రోజులు చపాతీలు తినాలి. కూరల్లో ఉప్పు ఉంటే కారం ఉండదు. కారం ఉంటే ఉప్పు ఉండదు. ఫుడ్ వేస్ట్ చేస్తే బిగ్ బాస్ ఒప్పుకోడు. బిగ్ బాస్ లో ఫుడ్ విలువ బాగా తెలుస్తుందని " తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

ఇక, నాగ మణికంఠ ఎలిమినేట్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. నాగ మణికంఠ (Naga Manikanta) ఇంట్లో ఉన్నన్ని రోజులు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అతడి గేమ్ ని చూసి టాప్ 5లో నాగ మణికంఠ ఉంటాడని అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు.

Read More..

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ అవుట్ ..

Advertisement

Next Story

Most Viewed