ట్రైన్‌లో కారు-బైక్ పంపితే ఎంత ఛార్జ్ అవుతుంది.. ఎలా పంపాలి?

by Anjali |   ( Updated:2024-10-28 06:51:10.0  )
ట్రైన్‌లో కారు-బైక్ పంపితే ఎంత ఛార్జ్ అవుతుంది.. ఎలా పంపాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణం(travel) సాఫీగా జరగాలన్నా , సమయాన్ని ఆదా చేసుకోవాలంటే చాలా మంది రైలు(train)లో ప్రయాణించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ట్రైన్ లో సౌకర్యవంతంగా ఉంటుంది. మన భారతీయ రైల్వే(Indian Railways) ద్వారా రోజుకు కోట్లాది మంది జనాలు ప్రయాణిస్తారు. రైలులో వెళ్తే చాలా సౌకర్యాలు కూడా ఉంటాయి. నిద్రవస్తే పడుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా సరుకులను తీసుకెళ్లే ఫెసిలిటీ(facility) కూడా ఉంటుంది. అలాగే రైలులో బైక్స్-కార్ల(Bikes-cars)ను కూడా ఒక నగరం నుంచి మరో నగరానికి తీసుకెళ్తారు. మరీ ట్రైన్ లో కారు-బైక్ తీసుకెళ్తే ఎంత ఎంత ఛార్జ్ అవుతుందో చాలా మందికి తెలిసుండదు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఒకవేళ బైక్ రైళ్లలో తీసుకెళ్తే ఎంత దూరం అని చూస్తారు. అలాగే వెయిట్ కూడా లెక్కిస్తారు. ఇలా ఒకవేళ 500 కిలో మీటర్ల(Kilometers)లోపు రవాణా చేస్తే రెంట్ 2000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పంపితే మొత్తం ఛార్జీలు కలిపి రూ. 8000 కట్టాల్సి ఉంటుంది. దీనికి స్పెషల్ ప్యాకింగ్ ఛార్జీ(Special packing charge) ఉంటుంది. డిస్టెన్స్ బైక్ వెయిట్ ను బట్టి కొన్నిసార్లు ఈ ఛార్జీల్లో మార్పులు ఉండవచ్చు. ఒక నగరం నుంచి మరొక నగరానికి కారును పంపాలనుకున్నప్పుడు పార్శిల్(Special packing charge) బుక్ చేసుకోవాలి. దీన్ని సామాన్లుగా పంపలేరు. కాగా ఆటోమొబైల్(Automobile) మోస్తున్న వాహనం ద్వారా పంపే అవకాశం ఉంటుంది. ఇక ఛార్జీ వస్తువుల బరువు బట్టి లెక్కిస్తారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed