- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
by Kalyani |

X
దిశ,మోమిన్ పేట్; రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మోమిన్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంటారం మండలంలోని రొంపల్లి గ్రామానికి చెందిన బైకా ని నరేష్ 21, మంగలి మనోజ్ కుమార్ 19 రొంపల్లి గ్రామం నుండి బైక్ పై ఇద్దరు మోమిన్ పేటకు వస్తున్న క్రమంలో మోమిన్ పెట్ గ్రామ శివారులోని కార్తికేయ కంపెనీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే సంఘటన స్థలాన్ని సిఐ.జి వెంకట్ పరిశీలించారు. మృతిని తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరవింద్ తెలిపారు.
Next Story