- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్

దిశ, ఖమ్మం సిటీ; ఐపీఎల్ బెట్టింగులపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్ష జరిపారు. సత్వర పరిష్కారం, సక్రమ విచారణ కోసం సంబంధిత దర్యాప్తు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... బెట్టింగ్,లోన్ యాప్ కార్యకలాపాలపై పూర్తిగా నిఘాను పెంచాలని, బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం వస్తే చాలు వెంటనే దాడులు చేయాలని ఆదేశించారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్షల నుండి తప్పించుకోలేరనే భావన నేరస్తుల్లో కలిగించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
కీలకమైన కేసుల్లో..కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశలో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విధిగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని తద్వారా నేరాలు నియంత్రణలో ఉంటాయని అన్నారు. ఎట్టి పరిస్థితులలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ రవాణా జరుగరాదని, అధికారులు సమన్వయంతో పటిష్టమైన నిఘా పెడుతూ పూర్తిగా కట్టడి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, పోస్టుమార్టం రిపోర్ట్స్, నేరస్తుల అరెస్టు చేయని కేసులలో నేరస్తులను అరెస్టు చేసి త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.
అలవాటుగా నేరాలు చేసే నేరస్తులపై హిస్టరీ షీట్‌లను తెరచి సరిహద్దు జిల్లాల పోలీస్‌స్టేషన్ల అధికారులతో నిరంతరం సమాచారాన్ని పంచుకుంటూ వారి కదలికలపై నిఘా ఉంచి వారి ద్వారా భవిష్యత్‌లో ఎటువంటి నేరాలు జరగకుండా నివారించాలి. నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్ పై తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్,ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి రిత్విక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రఘు, వేంకటేశ్, సాంబరాజు, రవి, సర్వర్,శ్రీనివాసులు పాల్గొన్నారు.