అత్తగారింటికి రోడ్డేయడానికి మాత్రం డబ్బులున్నాయా?.. CM రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

by Gantepaka Srikanth |
అత్తగారింటికి రోడ్డేయడానికి మాత్రం డబ్బులున్నాయా?.. CM రేవంత్‌పై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ(Runa Mafi)పై దేవుళ్ల మీద ఒట్టేసి రేవంత్‌(CM Revanth Reddy) మోసం చేశారని ఆరోపించారు. అసెంబ్లీ(Telangana Assembly)లో దానిపై ప్రశ్నిస్తే ప్రతిదాడులు, సస్పెన్షన్లు చేస్తున్నారని అన్నారు. బయట ప్రశ్నిస్తే పోలీస్‌ కేసులు పెడుతున్నారని తెలిపారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.

రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు లేవని పదే పదే చెబుతున్నారు.. మరి HMDAలో రూ.20వేల కోట్లతో టెండర్లు ఎలాపిలుస్తున్నారని అడిగారు. రేవంత్‌ అత్తగారిల్లు, ఆయన భూములున్న ఆమన్‌గల్‌కు.. రూ.5వేల కోట్లతో రోడ్డు ఎలా వేస్తున్నారని హరీష్‌ రావు ప్రశ్నించారు. వడగండ్ల వాన వల్ల రైతులందరూ నష్టపోయారని అగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శాసనసభను వేదిక చేసుకుని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed