విద్యార్థులు తమ లక్ష్యం మేరకు చదివి మంచి ఫలితాలు సాధించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

by Aamani |
విద్యార్థులు తమ లక్ష్యం మేరకు చదివి మంచి ఫలితాలు సాధించాలి : కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ,మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం కూరగాయలు,భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం మహమ్మదాబాద్ మండలంలో కలెక్టర్ పర్యటించారు. మండలం లో నంచర్ల ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు,ఉపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఆకుకూరలు,కాయగూరలు,గుడ్డు అందించాలని ఆదేశించారు. విద్యార్థులు తమ లక్ష్యం మేరకు చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.త్రాగు నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మహమ్మదాబాద్ తహశీల్దార్ కార్యాలయం లో రెవెన్యూ,మిషన్ భగీరథ,ఇరిగేషన్,వ్యవసాయ శాఖ అధికారులతో త్రాగు నీరు సరఫరా,సాగు నీరు,పంటల సాగు పై సమీక్షించారు. సంగాయ పల్లి,ధర్మాపూర్ గ్రామాల్లో త్రాగు నీరు సరిపడా సరఫరాలో సమస్య ఉన్నట్లు తెలిపారు.త్రాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆమె ఆదేశించారు.

మండలంలో పంటల సాగు, వరి పంట పై సమీక్షించారు. బోరు బావుల నీటి సాగు తో వేసిన వరి పంట భూగర్భ జలాలు ఇంకి సుమారు 140 ఎకరాల్లో ఎండినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు సరైన సలహాలు అందించి అవగాహన కలిగించాలని అన్నారు. అక్కడే పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి కావచ్చి రెండవ తరగతి కి కావాల్సిన వసతి గురించి కలెక్టర్ కు వివరించారు .రెండవ సంవత్సరం తరగతుల నిర్వహణ తహశీల్దార్ కార్యాలయం లో తాత్కాలికంగా నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించేందుకు అధికారులతో చర్చించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు1,2,ఎంపీడి ఓ కార్యాలయం పరిశీలించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక పాఠశాల రెండవ ప్రాథమిక పాఠశాలకు తరలించి తహశీల్దార్ కార్యాలయం ను ఒక ప్రాథమిక పాఠశాలకు షిఫ్ట్ చేసేందుకు అవకాశాలు పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ తిరుపతయ్య,ఎంపీడీ ఓ నరేందర్ రెడ్డి,నంచర్ల ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story