ముస్లింలకు సూపర్ న్యూస్.. రంజాన్ గిఫ్టులు సిద్ధం

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-25 13:11:04.0  )
ముస్లింలకు సూపర్ న్యూస్.. రంజాన్ గిఫ్టులు సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్(Ramadan) పండుగ సమీపిస్తోన్న వేళ బీజేపీ మైనార్టీ మోర్చా(BJP Minority Morcha) కీలక నిర్ణయం తీసుకున్నది. ‘సౌగాత్ ఈ మోడీ’ క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రంజాన్ వేళ ముస్లిలకు పండుగ కిట్లను అందించబోతున్నారు. దేశ వ్యాప్తంగా 32 లక్షల మందికి ఈ కిట్లు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే 32 వేల మోర్చా కార్యకర్తలు, 32 వేల మసీదుల్లో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) బుధవారం నాడు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవి పురుషులు, స్త్రీలకు అందించబోతున్నారు.

ఈ కిట్లలో పలు రకాల డ్రై ఫ్రూట్స్(Dry Fruits) ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల 1వ తేదీన నెలవంక కనిపించడంతో ఈ పండగ సందడి ఆరంభమైంది. ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. ముస్లింలు నెల రోజుల కాలాన్ని లెక్కించడానికి క్యాలెండర్‌కు బదులుగా చంద్రుడిని ఆధారంగా తీసుకుంటారు. నెలవంక దర్శనంతో ఆరంభం అయ్యే రంజాన్ ఉపవాస దీక్షలను మళ్లీ.. చంద్ర దర్శనం తరువాతే ముగిస్తారు. ఆ మరుసటి రోజే పండగను జరుపుకొంటారు.

Next Story