Jani Master: అర్ధరాత్రి రోడ్డు యాక్సిడెంట్.. దయచేసి వేగంగా వెళ్ళకండి అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Jani Master: అర్ధరాత్రి రోడ్డు యాక్సిడెంట్.. దయచేసి వేగంగా వెళ్ళకండి అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఇటీవల తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ అమ్మాయి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జానీ పరార్ అయ్యారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి రాజేంద్రనగర్ ఎస్‌వోటీ(Rajendranagar SWOT) పోలీసులు గోవా(Goa)లో అరెస్ట్ చేసి జానీ మాస్టర్‌(Jani Masterను హైదరాబాద్‌కు తీసుకొచ్చి చంచల గూడ జైలుకు తరలించారు. అయితే గత శుక్రవారం ఆయనకు హైకోర్టు(High Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

దీంతో చంచలగూడ జైలు(Chanchalguda Jail) నుంచి బయటకు వచ్చారు. ఇక జైలు నుంచి ఇంటికి చేరుకున్న జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, జానీ మాస్టర్(Jani Master) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి వెంటనే మెడికల్ సపోర్టు ఇప్పించి ఆసుపత్రికి తరలించాము.

దయచేసి, రోడ్లపై రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు త్వరగా ఇంటి కెళ్ళాలని మీ తలలో ఎన్ని ఆలోచనలున్నా సరే వేగంగా వెళ్ళకండి. హెల్మెట్(helmet) ధరించడం మర్చిపోకండి’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా యాక్సిడెంట్(accident) వీడియోను జత చేశారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా..అది చూసిన కొందరు నెటిజన్లు జానీ మాస్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం పబ్లిసిటీ మొదలెట్టాడు అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story