ఎంఐఎం, కమ్యూనిస్టుల తోకలు కట్ చేసిన సీఎం.. క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలోనే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-18 07:58:14.0  )
ఎంఐఎం, కమ్యూనిస్టుల తోకలు కట్ చేసిన సీఎం.. క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలోనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తమకు మద్దతిచ్చిన పార్టీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు మద్దతివ్వడంతో పాటు అక్కడ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. వచ్చిన మార్జీన్ మెజారిటీ తమ వల్లే అని కమ్యూనిస్టులు చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల అట్టహాసంగా నిర్వహించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలను పిలువకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండే ఎర్రజెండా పార్టీలను అంబేడ్కర్ ప్రోగ్రాంకు పిలువకపోవడం ఏంటనే చర్చ సాగుతుంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

బీఆర్ఎస్‌పై సాఫ్ట్‌గా అయినా షాక్ తప్పలే..

గతంలో లాల్ - నీల్ నినాదాన్ని ఎత్తుకున్న కమ్యూనిస్టులు ఈ నినాదంతోనే సామాజిక న్యాయం సాధ్యమని ప్రకటించారు. కానీ ఇటీవల రెండు కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్‌పై సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో పలు కీలక స్థానాలను ఆ పార్టీలు ఆశిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీతోనే తమ ఫైట్ అని సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు ఇప్పటికే కుండ బద్దలు కొట్టిన వేళ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై సైతం ఈ రెండు పార్టీలు నోరు మెదపడం లేదు. పోరాటాల్లో ముందుండే కమ్యూనిస్టులకు కారు పార్టీతో పొత్తు కారణంగా.. ప్రధాన సమస్యలపై స్ట్రైక్ హాలీడే లభించిందా అనే చర్చ జోరందుకుంది. రాజకీయ స్వప్రయోజనాల కోసం పొత్తు రాగం అందుకున్న ఉద్యమ నేత కేసీఆర్ కమ్యూనిస్ట్ ప్రజా పొరాటాలను తాత్కాలికంగా బ్రేక్ వేయడంలో సఫలం అయ్యారు.

స్పెషల్ గెస్ట్‌కు నో ప్రియారిటీ..

ఎన్నికల వేళ ఎర్రజెండా పార్టీల స్టాండ్‌తో కార్యకర్తల్లో కాస్తా అయోమయం నెలకొంది. ఇక కొంత మంది కమ్యూనిస్ట్ ముఖ్య నేతలు గులాబీ కండువా వేసుకోకుండానే ప్రభుత్వ విధానాలను బాహాటంగా మద్దతివ్వడం కొసమెరుపు. అయితే గులాబీ బాస్ మాత్రం అంబేడ్కర్ సిద్ధాంతాన్ని తామే బలంగా అమలు చేస్తున్నామనే కీలకమైన మెసెజ్ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. విగ్రహావిష్కరణ వేదికపైన సైతం కేవలం సీఎం కేసీఆర్ ఫోటో మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడింది. స్పెషల్ గెస్ట్ అని చెప్పినా ప్రకాష్ అంబేడ్కర్ ఫోటోను మాత్రం సభావేదిక ఫ్లెక్సీపై మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. తద్వారా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ క్రెడిబులిటీ నేషనల్ పాలిటిక్స్‌లో అదృష్టం పరిక్షించుకోబోతున్న బీఆర్ఎస్‌కే దక్కేలా ప్లాన్ చేశారు.

ఎంఐఎంకు నో ఇన్విటేషన్..

మిత్ర పక్షం అని చెబుతూనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి సైతం అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఇన్విటేషన్ లేక పోవడం గమనార్హం. హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ సైతం అంబేడ్కర్ వాదాన్ని ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తున్నారు. మైనార్టీలకు గొంతుకగా ఉన్న తమ పార్టీ దళితులకు సైతం బాసటగా నిలుస్తుందనే గట్టి మెసెజ్ ఇవ్వడంలో భాగంగానే ఎంఐఎం చీఫ్ అంబేడ్కర్ వాదాన్ని ఎత్తుకున్నారని గతంలో చర్చ జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం కేవలం బీఆర్ఎస్‌కు మాత్రమే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మార్కులు పడేలా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అందులో భాగంగానే పతంగి పార్టీకి షాక్ ఇచ్చారు. దళిత సీఎం మాట దేవుడెరుగు.. ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవి సైతం తమ వర్గం నేత నుంచి లాక్కున్నారని కొంత మంది దళిత సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, దళిత సీఎం లాంటి అంశాల్లో ఆ వర్గంలో ఉన్న అసంతృప్తిని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏ మేరకు చల్లారుస్తుందో అనేది మాత్రం తేలాల్సి ఉంది.

Read more:

‘తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నదా’.. కేసీఆర్‌పై రఘునందన్ రావు సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed