- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీతో KCR చేతులు కలిపింది అందుకే.. : ఏఐసీసీ చీఫ్ ఖర్గే
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ఆప్ సర్కార్‌తో కేసీఆర్ కుమ్మక్కై మద్యం స్కామ్‌లో పాలుపంచుకున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన్ ఖర్గే విమర్శలు గుప్పించారు. కవితను కాపాడుకునేందుకే కేసీఆర్ మోడీతో చేతులు కలిపారని కేసీఆర్, మోడీ ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. శనివారం బన్సీలాల్ పేటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడిన ఖర్గే.. పేదల ఖాతాల్లో మోడీ రూ.15 లక్షలు వేస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తే అలాంటి హామీలే ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే బీహెచ్ఈఎల్ వంటి సంస్థలు తీసుకువస్తే వాటిని మోడీ అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. మోడీ, కేసీఆర్ పేదలను పేదలుగానే ఉంచుతూ ధనవంతులకు కొమ్ముకాస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీలుగా ఉంచిందని వాటిని భర్తీ చేస్తే పేదల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొచ్చన్నారు. తాము అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేదలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నాడని ఇటువంటి ప్రభుత్వాన్ని కొనసాగిద్దామా తీసిపారేద్దామా అని ప్రశ్నించారు.