- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YS Sharmila బస్సుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు (వీడియో)
దిశ,చెన్నరావుపేట: షర్మిల పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పెద్దిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం షర్మిల బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో చెన్నరావుపేటలో ఉద్రిక్తతల నడుమ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్నది. షర్మిల వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు పెట్రోల్‌తో దాడి చేశారు. షర్మిల వాహనంపై పెట్రోల్ పోసి తగుల బెట్టారు.దీనితో మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న కార్యకార్తలు వాటర్ తో మంటలు ఆర్పారు. ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం ఆమె పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే నర్సంపేట, జల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు దహనం చేశారు. ఇదే క్రమంలో జల్లి నుండి సూరిపెల్లి మధ్యలో షర్మిల పాదయాత్రని అడ్డుకునే విధంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జల్లి గ్రామ నాయకులని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో సూరిపల్లి నాయకులు, కార్యకర్తలు ఏమైనా ప్లాన్ చేశారా.. అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యే పెద్దిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు షర్మిలపై అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు పదుల సంఖ్యలో ఎస్ఐ లు , మహిళా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్ల నడుమ ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. దాడుల నేపథ్యంలో షర్మిలను వేరే జిల్లాకు పోలీసులు తరలించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Read More: కేసీఆర్ పై YS Sharmila సంచలన వ్యాఖ్యలు..