గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్

by Prasad Jukanti |
గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేవైఎం నిరసనకు దిగింది. ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి గాడిద గుడ్డు ఇచ్చారని ఫ్లకార్డులతో నిరనస వ్యక్తం చేశారు. అయితే నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో పలువురు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed