కేదార్‌నాథ్‌లో మరింత దిగజారిన పరిస్థితి.. బండి సంజయ్‌కు తెలుగు యాత్రికుల మెసేజ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-03 10:41:14.0  )
కేదార్‌నాథ్‌లో మరింత దిగజారిన పరిస్థితి.. బండి సంజయ్‌కు తెలుగు యాత్రికుల మెసేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌ ప్రజలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కేదార్‌నాథ్ ప్రాంతంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మందాకిని నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో భారీ వరదలు సంభవించి జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదల్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా నడకమార్గం మొత్తం దెబ్బతినడంతో పాటు గౌరీకుంద్ - కేదార్‌నాథ్ మధ్య 13 మార్గాలు విధ్వంసం అయ్యాయి. దీంతో యాత్రికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకున్నారు. ప్రస్తుతం పోలీసులు, SDRF బృందం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వరద పరిస్థితుల కారణంగా రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ ఇప్పటికే యాత్రను నిలిపివేశారు.

బండి సంజయ్‌కు తెలుగు యాత్రికుల మెసేజ్

కేదార్‌నాథ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు. ఆహారం, నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తమకు వెంటనే సహాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. తనకు మెసేజ్ వచ్చిన వెంటనే బండి సంజయ్ ఉత్తరఖాండ్ ప్రభుత్వంతో మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సహాయక చర్యలకు సైతం వాతావరణం అనుకూలించడం లేదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed