Middela Sunni Reddy : వెయిన్ స్టేట్ వర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మిద్దెల సున్నిరెడ్డి

by Hajipasha |
Middela Sunni Reddy : వెయిన్ స్టేట్ వర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మిద్దెల సున్నిరెడ్డి
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉన్న వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్(పాలక మండలి) ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మిద్దెల సున్నిరెడ్డి(Middela Sunni Reddy) గెలిచారు. ఆయన రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ వాస్తవ్యులు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన సున్నిరెడ్డి 24 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన మైఖేల్ బుస్యూటో 24.8 శాతం ఓట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

వెయిన్ స్టేట్ యూనివర్సిటీ‌(Wayne State University)లో రెండు బోర్డ్ ఆఫ్ గవర్నర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు ఆ పోస్టులకు అర్హులు. దీని ప్రకారం వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ అయ్యే అవకాశాన్ని సున్నిరెడ్డి దక్కించుకున్నారు. ఈ పదవికి ఎంపికయ్యే వారు ఎనిమిదేళ్ల పాటు యూనివర్సిటీ పాలక మండలిలో సభ్యులుగా సేవలు అందించొచ్చు. పాలక మండలిలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed