తెలుగుస్టాప్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్

by Javid Pasha |   ( Updated:2023-07-22 16:07:55.0  )
తెలుగుస్టాప్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుస్టాప్ మొబైల్ యాప్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సినిమా, సైన్స్ రంగాలకు సంబంధించిన ఎన్నో బ్రేకింగ్ వార్తలను తెలుగుస్టాప్ యాప్ ద్వారా వేగంగా పొందవచ్చని అన్నారు. మంచి మంచి వార్తలతో తెలుగుస్టాప్ యాప్ ప్రజల ఆదరాభిమానాలను పొందాలని ఆకాంక్షించారు.

అనంతరం తెలుగుస్టాప్ యాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు మాట్లాడుతూ.. తెలుగుస్టాప్ యాప్ లో వార్తలను అత్యంత వేగంగా, ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రావూరి సైదాబాబు, సాధినేని మోహన్ రావు,ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Next Story