- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
TS News:లండన్‌లో ముగిసిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్.. అలరించిన తెలంగాణ పర్యాటక రోడ్ షో
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వండి.. ప్రమోషన్‌లో భాగస్వాములవ్వండి’ అని ఎన్ఆర్ఐ, పెట్టుబడిదాలను మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని, తెలంగాణ పర్యాటక ప్రమోషన్ ప్రమోషన్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని, విదేశీయులు తెలంగాణ సందర్శించేలా ప్రోత్సహించి, పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. లండన్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ గురువారం ముగిసింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ స్టాల్స్ ను సందర్శించారు. బతుకమ్మ వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో అంతర్జాతీయ స్థాయిలో తగిన ప్రచారం చేశామన్నారు.
రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, సోమశిల, బుద్ధవనం,, వేయి స్తంభాల గుడి, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా తాము అధ్యయనం చేస్తున్నామని, తెలంగాణ పర్యాటకం సైతం అదే స్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్నామని వివరించారు. విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లతో అనుబంధం ద్వారా కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి అంశాలలో ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ అత్యంత ఫలవంతమైందన్నారు.
నెట్ వర్కింగ్, వ్యాపార అవకాశాలు, ఆలోచనలు, సమాచార మార్పిడి ద్వారా ట్రావెల్ టూరిజం, పర్యాటక పరిశ్రమకు చెందిన వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే చోట చేర్చడానికి వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024కు లండన్‌ను వేదికగా ఉపయోగించుకోవడానికి తెలంగాణ పర్యాటక శాఖ తన వంతు ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహించిన రోడ్ షో లో లండన్ లో స్థిరపడ్డ తెలంగాణ ప్రవాసీయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడాలు, స్మారక చిహ్నాలు, బిగ్ బెన్, లండన్ ఐ, బకింగ్ హామ్ ప్యాలెస్ ను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, అనిరుధ్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.