తెలంగాణ సచివాయలంలో పలు కీలక మార్పులు

by Gantepaka Srikanth |
తెలంగాణ సచివాయలంలో పలు కీలక మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సచివాయలంలో పలు కీలక మార్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగా మెయిన్ గేట్‌ను మూసివేశారు. మెయిన్ గేట్‌ను ప్రస్తుతమున్న గేట్‌కు కొద్ది దూరంలో ఈశాన్యం వైపునకు మారనుంది. దీని కోసం శుక్రవారం మెయిన్ గేట్‌ను రేకులతో మూసి వేశారు. కొత్తగా ఏర్పాటు చేసే గేటు దగ్గర కూడా పనులకు ఇబ్బంది రాకుండా రేకులతో మూసి వేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయం లోపల రోడ్డు నిర్మించడానికి గాను పనులు చేస్తున్నారు.

రోడ్డుకు అవసరమైన మేరకు భూమిని తవ్వారు. ఈ రోడ్డు సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వైపుగా రోడ్డును నిర్మిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు లో భాగంగా ఇరవై ఏడు అడుగుల వెడల్పుతో ఈ రహదారి ని నిర్మిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే గేటు నుంచే సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లుగా సమాచారం. ఈ పనులన్నంటికి రూ.3.20 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీని కోసం టెండర్లను పిలిచారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. డిసెంబర్ 9 సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉన్నందున అప్పటి లోగా పనులు పూర్తి చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story