University Of Chicago Library : యూనివర్శిటీ ఆఫ్ చికాగో లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ భాండాగారం.. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |   ( Updated:2024-11-04 12:31:29.0  )
University Of Chicago Library : యూనివర్శిటీ ఆఫ్ చికాగో లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ భాండాగారం.. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయ లైబ్రరీల్లో ఒకటైన university of Chicago library చికాగో యూనివర్సిటీ లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాలను టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చ‌క్ర‌పాణి తాజాగా ఎక్స్ వేదికగా ఫోటోలను పంచుకున్నారు. తెలంగాణ బుద్ధిజీవులు చేసిన గొప్ప మేలు ఈ నేల ఆకాంక్షలను, పోరాటాల చరిత్రను, వారసత్వాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రస్థానాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయడమన్నారు. అది భవవ్యాప్తి చేయడంతో పాటు, చోదక శక్తిగా ఉద్యమాన్ని నిలబెట్టింది, నడిపించిందని తెలిపారు. స్కూల్ పిల్లవాడిగా ఉద్యమాన్ని గమనించి, అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు, రచయితలు, నాయకుల పరిచయం కలిగి ఉండి ఇంట్లో ఉద్యమ వాతావరణంలో పెరిగిన మా అబ్బాయి మిలింద్ ఇవాళ తన యూనివర్సిటీ Chicago చికాగో లైబ్రరీలో తెలంగాణ ఉద్యమ భాండాగారాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాడని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయ లైబ్రరీ అయిన ఈ గ్రంథాలయంలో అనేక వరుసల్లో వేలాదిగా పుస్తకాలు అందునా Telangana movement history books తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు ఉండటం చరిత్ర విద్యార్థిగా, పుస్తక ప్రేమికుడిగా అతనికి కనువిందైన విషయం.. అని తెలిపారు. వెంటనే నాకు పంపిన ఫోటోలలో కొన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు షేర్ చేశారన్నారు. బాధాకరం అయిన విషయం ఏమిటంటే మనం ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సమగ్ర చరిత్రను సంగ్రహ పరిచే పని చేయలేక పోవడమన్నారు. అలాంటి లైబ్రరీని ఒక దానిని ఏర్పాటు చేసుకోలేక పోవడం.. ఇప్పటికైనా ఆ పని చేయాలని, రాహుల్ మిలింద్ నాతో పంచుకున్న ఫోటోల్లో కొన్ని అంటూ ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మరోవైపు Rahul Milind మిలింద్ చేసిన ట్వీట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. త్యాగాలతో ఏర్పడిన గొప్ప ప్రజాస్వామ్య పోరాటం.. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలను లైబ్రరీలో ఏర్పాటు చేసినందుకు మా తరపున చికాగో విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు చెప్పు.. అంటూ రాహుల్ మిలింద్‌కు KTR కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed