- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త.. రెండు రోజుల్లో డీఎస్సీ!
దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెండో రోజుల్లో డీఎస్సీ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి.. మొత్తం 6,500 పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, 1,523 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
ఈసారి టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టులు భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని ఇప్పటికే 5,310 టీచర్ పోస్టుల భర్తీ చేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్దీకరించామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్య అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.