గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

by samatah |
గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కురమలకు తీపికబురు అందించింది. వచ్చే నెల ఐదవ తేదీ నుండి రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గొర్రెల పంపిణీ రెండవ విడత కార్యక్రమం పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని సూచించారు.

Advertisement

Next Story