విదేశాల్లో MBBS పూర్తి చేసిన మెడికోలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

by Satheesh |
విదేశాల్లో MBBS పూర్తి చేసిన మెడికోలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెడికోలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కొత్త మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు సర్కార్​అవకాశం ఇచ్చింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్‌లైన్స్‌ను ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశిస్తూ స్టేట్‌ మెడికల్ కౌన్సిల్‌కు హెల్త్ సెక్రటరీ రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఇండియాకు వచ్చిన తర్వాత ఫారిన్‌ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.

ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏదైనా మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాకే డాక్టర్‌‌గా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. గతంలో వీరు ఇంటర్న్‌షిప్ ఎక్కడ చేయాలనేదానిపై నిబంధనలు లేవు. ఇటీవలే దీనికి సంబంధించి ఎన్‌ఎంసీ కొత్త రూల్స్ జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం ఎఫ్ఎంజీ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను మెరిట్‌గా తీసుకుని ఇంటర్న్‌షిప్‌ సీట్లు కేటాయించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లోనే వీరికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఇవ్వాలని మరో నిబంధన పెట్టడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed