Tealangana DGP: నిమజ్జనాలపై ఏరియల్ సర్వే.. డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Tealangana DGP: నిమజ్జనాలపై ఏరియల్ సర్వే.. డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిమజ్జనాలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, నగరంలో 25 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారని, నిమజ్జానాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. నిమజ్జన ఉత్సవాలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సజావుగా జరిగిందని తెలిపారు. ఈ రోజు రాత్రి మొత్తం నిమజ్జనాలు జరుగుతాయని, రేపు కూడా చాలా చోట్ల జరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేస్తామని, వర్కింగ్ డే కావడంతో ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా.. నిమజ్జనాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, దీని కోసం కలెక్టర్ సహా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి రూట్ ను పరిశీలించడం జరగిందని, ట్యాంక్ బండ్ వరకు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు వినాయక నిమజ్జన ఉత్సవాల గురించి హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నామని తెలిపారు. ఇక హైదరాబాద్ అంతటా 25 వేల మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారని, ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ ఏర్పాటు చేశామని, నిమజ్జన కార్యక్రమాలను సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేస్తున్నామని అన్నారు. నిమజ్జనాలు సజావుగా జరిగేలా చూస్తున్నామని, అందరూ ఆనందంగా నిమజ్జనాల్లో పాల్గొనాలని చెబుతూ ప్రజలందరికీ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story